Prabhas: ధురంధర్: ది రివెంజ్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది! మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ.. ఇప్పటికే 1700 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. త్వరలోనే పుష్ప-2, బాహుబలి-2 రికార్డులను సైతం తుడిచిపెట్టేలా కనిపిస్తోంది.
ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఇంకా సందీప్ రెడ్డి వంగా, కోకాపేటలోని అల్లు సినిమాస్‌లో నిన్న రాత్రి ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాను చూశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఇలా ఆడియన్స్‌తో కలిసి సినిమా చూడడం ఈ సినిమాకే దక్కింది. సందీప్ రెడ్డితో సినిమా చేస్తున్నప్పటి నుండి ప్రభాస్‌లో చాలానే మార్పులు వస్తున్నాయి. ఎప్పుడూ మాట్లాడని ప్రభాస్ ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో కూడా చాలా సేపు మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, నెలకు ఒక్కసారైనా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు.
ఇదే ఏడాది నాలుగుసార్లు కనిపించిన ప్రభాస్.. ముందు రాజాసాబ్తో కనిపిస్తే, తర్వాత ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ సక్సెస్ తర్వాత మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అలాగే ‘బైకర్’ రిలీజ్ సమయంలో, మిర్చి సినిమాలోని డైలాగ్ ఇంకా డ్రెస్ వేసుకొని సినిమాను ప్రమోట్ చేశారు. ఇలా చూసుకుంటే ప్రతి నెల ఒక్కసారి కనిపిస్తున్నాడు ప్రభాస్.. జనవరిలో రాజాసాబ్, ఫిబ్రవరిలో కపుల్ ఫ్రెండ్లీ, మార్చిలో బైకర్, ఇప్పుడు ఏప్రిల్‌లో ధురంధర్ సినిమా చూస్తూ మెల్లగా మారిపోతున్న ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
