Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సన్నద్ధమైంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా, మూడో సింగిల్ ‘అసుర హననం’ పాట గ్రాండ్‌గా లాంచ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిత్రంలోని ‘తార సితార’ అనే ఐటెం సాంగ్‌లోని కొన్ని లైన్స్‌పై డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేసి, వాటిని బాధ్యతాయుతంగా మార్చి రీ-రికార్డింగ్ చేయించారని వెల్లడించారు. త్వరలో ‘తార సితార’ పాట రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

