Pralay

Pralay: రణ్‌వీర్ ‘ప్రలే’లో అలియా భట్ హీరోయిన్‌గా ఫిక్స్!

Pralay: ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కెరీర్ జోరుగా సాగుతోంది. ఈ ఏడాది ధురంధర్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆయన, ఇప్పుడు పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ థ్రిల్లర్ ‘ప్రలే’పై దృష్టి పెట్టారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అలియా భట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Roshan: ఛాంపియన్ హీరో రోషన్‌కు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి భారీ ఆఫర్!

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది విడుదలైన ధురంధర్ సినిమాతో భారీ వసూళ్లు సాధించిన ఆయన, తదుపరి ప్రాజెక్ట్ ‘ప్రలే’పై ఫోకస్ పెట్టారు. జై మెహతా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టులో కథానాయికగా అలియా భట్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గల్లీ బాయ్, రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ చిత్రాల్లో రణ్‌వీర్-అలియా జోడీ అదరగొట్టింది. ఇప్పుడు ఈ థ్రిల్లర్‌లో వారి కాంబినేషన్ మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. అలియా పాత్ర కేవలం ప్రేమికురాలిది మాత్రమే కాదు, రణ్‌వీర్ ఆలోచనలను సవాలు చేసే శక్తివంతమైనదిగా ఉంటుందని టాక్. రణ్‌వీర్ మనుగడ కోసం పోరాడే వ్యక్తిగా కనిపించనున్నారు. ప్రస్తుతం అలియాతో చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టులో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వినూత్న కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ అనుభవాన్ని అందించడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *