KTR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన అద్భుత వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని, తెలంగాణ ఉద్యమ గాథను మరోసారి ప్రపంచానికి గుర్తు చేశారు. 14 ఏళ్ల అలుపెరగని ఉద్యమం, కేసీఆర్ అసామాన్య నాయకత్వం, పదేళ్ల అభివృద్ధి పయనంపై ఆయన హృదయాన్ని స్పృశించేలా ప్రసంగించారు.
“ఓట్లలో వెనుకబడినా.. తెలంగాణను ప్రేమించడంలో ఎప్పుడూ ముందే ఉంటాం” అని కేటీఆర్ ఉద్ఘాటించారు.
“మళ్లీ మూడేళ్లలో అధికారంలోకి వస్తాం. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు” అని ధైర్యంగా ప్రకటించారు.
తెలంగాణను స్టార్టప్ స్టేట్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కు చెందుతుందని, ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రయోగంగా నిలిచిందని చెప్పారు. ఒకప్పుడు శోచనీయ స్థితిలో ఉన్న ప్రాంతాన్ని దేశానికి ఆర్థిక ఇంజన్‌గా మార్చిన నాయకత్వం కేసీఆర్‌దే అని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ఆవిర్భావం – ఆత్మగౌరవానికి జీవనాధారం
కేటీఆర్ మాట్లాడుతూ – “జననీ, జన్మభూమి చుట్టూ బాధ్యత తీసుకోవాలి. ఓ ప్రవాస భారతీయుడిగా మనం ఎక్కడ ఉన్నా తెలంగాణ కోసం నడుస్తేనే మన పుట్టిన మట్టికి రుణం చెల్లించినట్టే” అన్నారు. ఎన్నారైలందరిని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధిలో గర్వకారణాలు
2014లో రాష్ట్ర జీఎస్‌డీపీ నాలుగు లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం అది 15 లక్షల కోట్లకు చేరుకున్నదని వివరించారు. ఇది కేసీఆర్ తీసుకున్న సాహసోపేత ఆర్థిక నిర్ణయాల ఫలితమని చెప్పారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, కాకతీయ కెనాళ్లు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు రాష్ట్ర పునరుజ్జీవనానికి మార్గదర్శకంగా నిలిచాయని, నాలుగేళ్లలో ఇవన్నీ పూర్తవడం ఏ రాష్ట్రంలోనూ చూడలేమని స్పష్టంగా తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడుతూ – “సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం ఈ నగర పురోగతికి ఆశ్చర్యపోయారు” అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు, అమెరికాలో చదివేందుకు రూ.20 లక్షల స్కాలర్షిప్‌తో 8,000 మందికి మద్దతు ఇవ్వడం వంటి విషయాలను వివరించారు.
భవిష్యత్తుపై బీఆర్ఎస్ దృష్టి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి మార్పులను భయపడకుండా స్వీకరించాలని, తెలంగాణ యువత మార్చే ప్రపంచానికి ముందుగానే సిద్ధం కావాలని కేటీఆర్ సూచించారు.
అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థులకు బీఆర్ఎస్ లీగల్ సెల్ ద్వారా పూర్తి మద్దతుగా నిలబడతామని హామీ ఇచ్చారు.
ఉద్యమ నేతకు జాతీయ గౌరవం
కేటీఆర్ ప్రసంగంలోనూ, వేడుకల వేదికపైనూ – “ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమాన్ని సునామిగా మార్చిన నాయకుడు కేసీఆర్. ‘తెలంగాణ మిషన్ ఇంపాజిబుల్’ను ‘పాజిబుల్’గా మార్చిన నేత” అనే అభిప్రాయాలు ప్రతిధ్వనించాయి.
తెలంగాణ ఉద్యమ గాథను గుర్తుచేసే వేళ.. అభివృద్ధి, ఆత్మగౌరవం, ఆకాంక్షల సాధనకు మార్గదర్శకుడిగా కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను చూసే సమయం ఇది.
