Posani krishna murali: ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తనపై నమోదైన కేసులో గుంటూరు కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కోర్టు ఎదుట కన్నీరు పెట్టుకున్న పోసాని, తన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించారు.
కోర్టులో కన్నీటి పర్యంతమైన పోసాని
కోర్టు విచారణ సందర్భంగా పోసాని మాట్లాడుతూ, “నా ఆరోగ్యం బాగా లేదు. నాకు ఇప్పటికే రెండు ఆపరేషన్లు జరిగాయి. స్టంట్లు కూడా వేశారు,” అంటూ తన ఆరోగ్య సమస్యలను వివరించారు. ఈ నేపథ్యంలో తాను తప్పు చేసినట్లు నిరూపణ అయితే, ఎవరైనా నరికేయాలని అన్నారు.
బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యం
ఈ కేసులో రెండు రోజుల్లోపు బెయిల్ రాకపోతే తనకు ఏదైనా అపాయమయ్యే అవకాశముందని పోసాని కోర్టు ముందు వాపోయారు. “ఇక ఈ బాధ భరించలేను. బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యం,” అని తీవ్ర భావోద్వేగంతో వెల్లడించారు.
పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.