Posani Krishna Murali: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నివాసంలో ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఏపీ ఎన్నికల సమయంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. అయితే, ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
పోసాని కృష్ణ మురళిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన యువజన విభాగం ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.
ఇది కూడా చదవండి: Posani krishna: పోసానిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు..
అంతేకాకుండా, పోసాని కృష్ణ మురళిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తదితరులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
తాజాగా, రాయచోటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరెస్ట్ సమయంలో అనారోగ్య కారణంగా తనకు సహకరించాలని పోసాని కోరినప్పటికీ, పోలీసులు పట్టించుకోకుండా ఆయన్ని ఏపీకి తరలించినట్లు తెలుస్తోంది.