Poonam Kaur

Poonam Kaur: సమంత పెళ్లి వేళ సంచలనం రేపుతున్న పూనమ్ ట్వీట్?

Poonam Kaur: టాలీవుడ్‌లో మరోసారి పూనమ్ కౌర్ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎవరి పేరు చెప్పకుండానే పరోక్షంగా సమంతని టార్గెట్ చేసినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంత-రాజ్ నిడిమోరు వివాహం టైమింగ్‌కు ఈ ట్వీట్ రావడం చర్చనీయాంశమైంది.

Also Read: Mrunal Thakur: శ్రేయస్ అయ్యర్‌తో డేటింగ్ వార్తలపై మృణాల్ ఠాకూర్ రియాక్షన్

హీరోయిన్‌గా పెద్దగా విజయాలు సాధించకపోయినా సోషల్ మీడియాలో తన విమర్శలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న పూనమ్ కౌర్ మళ్లీ చర్చనీయాంశమైంది. “నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా. ఇది బాధాకరం. మళ్లీ ఆమె బాగా శక్తివంతమైనది, చదువుకున్నది, అత్యంత ప్రాధాన్యత గల మనిషి. డబ్బు ఉంటే బలహీనమైన, ఆశపడే పురుషులు చాలా మంది వస్తారు” అని ఆమె ట్వీట్ చేశారు. ఎవరి పేరు ప్రస్తావించకపోయినా, ఈ ట్వీట్ టైమింగ్ కీలకంగా మారింది. ఎందుకంటే నిన్న సమంత, ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రాజ్‌కు ఇది రెండో పెళ్లి. మొదటి భార్య శ్యామలాదేవికి విడాకులిచ్చిన తర్వాతే సమంతతో సంబంధం ప్రారంభమైందన్న వార్తల నేపథ్యంలో పూనమ్ ట్వీట్ సంచలనం రేపింది. దీంతో నెటిజన్లు ఈ వ్యాఖ్యలు సమంతకే అని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశం భారీ చర్చకు దారితీసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *