Poonam Kaur: సినీ పరిశ్రమలో నటి పూనమ్ కౌర్ ఆరోపణలు మరోసారి సంచలనం రేపుతున్నాయి. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పోస్ట్ చేసిన స్క్రీన్‌షాట్లతో పూనమ్, “త్రివిక్రమ్‌ను వదిలేది లేదు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి,” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఝాన్సీతో జరిగిన చాట్ స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తూ, “ఫిర్యాదు చేశాను, మీటింగ్ అడిగితే డిస్టర్బ్ చేయవద్దన్నారు,” అని ఆమె మండిపడ్డారు. ‘మా’ అసోసియేషన్‌కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. “నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిపై చర్యలు లేకపోతే ఎక్కడికి వెళ్లాలి?” అని ప్రశ్నించారు. త్రివిక్రమ్ వెనుక రాజకీయ మద్దతు ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై త్రివిక్రమ్ ఇప్పటివరకు స్పందించలేదు. పూనమ్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, ఈ వివాదం ఎటు మళ్లుతుందో చూడాలి.
