Pooja Hegde

Pooja Hegde: కాంచన4లో నట విశ్వరూపం చూపించనున్న పూజా హెగ్డే!

Pooja Hegde: రాఘవ లారెన్స్ హార్రర్ సిరీస్ మూవీ ‘కాంచన 4’లో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో పూజా పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ అదిరిపోయే పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Appu Movie: పునీత్ రాజ్‌కుమార్ 50వ జయంతి సందర్భంగా ‘అప్పు’ గ్రాండ్ రీ-రిలీజ్!

‘కాంచన 4’ మూవీలో పూజా హెగ్డే ఓ మూగ మరియు చెవిటి అమ్మాయి పాత్రలో కనిపిస్తుందని.. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా అనేక ప్రశంసలు రావడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో పూజా నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆమె పాత్రపై అప్పుడే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి నిజంగానే పూజా ఈ సినిమాలో ఇలాంటి పాత్రలో నటిస్తుందా అనేది వేచి చూడాలి.

అరబిక్ కుతు – వీడియో సాంగ్ : 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Dhoom Dhaam : నవంబర్ 08న థియేటర్ లో ధూం ధాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *