pooja hegde

Pooja Hegde: శ్రీలీల అవుట్ పూజాహేగ్డే ఇన్!?

Pooja Hegde: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన హీరోయిన్ గా ఎంపికైంది కన్నడ భామ పూజా హేగ్డే. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. నిజానికి ఈ సినిమాలో ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ ను పూజహేగ్డే కొట్టేసింది. ఇది వరుణ్ తో పూజకు తొలి చిత్రం. ఈ విషయమై పూజను సంప్రదించినపుడు కొన్ని ఎనౌన్స్ మెంట్స్ రావలసి ఉంది. అది ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వస్తే బాగుంటుంది.

Pooja Hegde: అయితే ఒక్కటి మాత్రం నిజం. ఇకపై నన్ను విభిన్న పాత్రలలో చూడబోతున్నారు. ఈ ధావన్ ద్వయం ప్రాజెక్ట్‌ లో పూజాహేగ్డే తో పాటు మృణాల్ ఠాకూర్ కూడా నటించనుంది. చిత్ర పరిశ్రమలో తనకు గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరని, ఈ జర్నీలో ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేయవలసి ఉందని అంటోంది పూజా హేగ్డే. ప్రస్తుతం పూజా షాహిద్ కపూర్ ‘దేవా’, సూర్య 44, విజయ్ 69 సినిమాల్లో నటిస్తోంది. మరి ఈ సినిమాలతో పూజా మళ్ళీ బిజీ అవుతుదేమో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం సెన్సేషన్.. ఆల్ టైం రికార్డ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *