Pooja Hegde: పుష్కరకాలంగా వివిధ భాషల్లో సినిమాలు చేస్తోంది పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే. అయితే చిత్రంగా గత యేడాది ఆమె నటించిన సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. కానీ ఈ యేడాది ఆ లోటును తీర్చుతూ దాదాపు నాలుగైదు సినిమాలు రాబోతున్నాయి. అందులో మొదటగా జనం ముందుకు హిందీ సినిమా ‘దేవా’ ఈ నెల 31న వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రోషన్ ఆండ్రూస్ తెరకెక్కించిన ‘దేవా’లో రౌడీ పోలీస్ పాత్రను షాహిద్ కపూర్ పోషిస్తుంటే… ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పూజా హెగ్డే నటించింది. ఈ మూవీని రాయ్ కపూర్ ఫిలిమ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

