Pooja Hegde: తప్పులు జరిగాయని తెలుసు..ఇకపై జాగ్రత్తగా ఉంగా!

గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న పూజ హెగ్డే.. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తోంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుసగా క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతోంది ఈ భామ. ప్రస్తుతం దళపతి విజయ్‌ నటిస్తున్న 69వ చిత్రంలో కథానాయికగా ఆమె నటిస్తోంది. సూర్య 44వ సినిమాలో కూడా పూజాహేగ్డే కథానాయికగా ఖరారైంది.

ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో కూడా ఈ సొగసరి భారీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. వరుణ్‌ధావన్‌ సరసన ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటించబోతున్నట్లు తెలిసింది. ‘హే జవానీ తో ఇష్క్‌ హోనా హై’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి డేవిడ్‌ ధావన్‌ దర్శకుడు. ఈ ఆఫర్ రావడం పట్ల పూజాహెగ్డే ఆనందం వ్యక్తం చేసింది.‘సినిమాల ఎంపికలో నా మైండ్‌సెట్‌ను మార్చుకున్నా. కథల ఎంపికలో ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తా. నా గత చిత్రాలన్నింటిని విశ్లేషించి ఎక్కడ తప్పులు జరిగాయో తెలుసుకుంటా. వచ్చే ఏడాది నాకు మంచి విజయాల్ని అందిస్తుందనే నమ్మకంతో ఉన్నా’ అని పూజాహెగ్డే చెప్పింది.

కాగా, తెలుగులో పూజా హెగ్డే పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోయింది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తో దువ్వాడ జగన్నాద్, అలా వైకుంఠపురంలో సినిమాలలో నటించిన అలరించింది పూజా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *