Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సమాయత్తం అయిన వేళ.. అనూహ్య రీతిలో ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం (మే 5) నాడు భేటీ అయ్యారు. మే 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యానికి సమ్మె నోటీసును అందజేశాయి. మే 7న తెల్లవారుజాము నుంచి డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఈ దశలో ప్రభుత్వం చర్చలకు రావడంపై అంతటా ఆసక్తి నెలకొన్నది.
Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మిక నేతలతో జరిగిన చర్చల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని, కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి భేటీ సందర్భంగా నేతలకు సూచించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదని అర్థం చేసుకోవాలని సూచించారు. దీనిపై ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాల నేతల వైఖరి ఎలా ఉంటుందోనని ఉత్కంఠ నెలకొన్నది.