Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఓటర్లు అభివృద్ధికే పట్టంగట్టారని ఎన్నిక ఇన్‌చార్జి మంత్రి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలకు ప్రజలు మద్దతు పలికారని తెలిపారు. నగరంలోని తొలుత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అక్కడి ఓటర్ల మాదిరిగానే ఈ ప్రాంత ఓటర్లు కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారని సంతృప్తిని వ్యక్తంచేశారు.
Ponnam Prabhakar: కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలు సానుభూతికి కాకుండా అభివృద్ధిని ఆదరించారని మంతంకి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ నాయకులే కావాలని వివాదాలు సృష్టించారని మంత్రి ఆరోపించారు. తమ కార్యాలయంపైనే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేశారని తెలిపారు.
Ponnam Prabhakar: బీజేపీపైనా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తాము తొలి నుంచి చెప్తున్నట్టుగా బీజేపీ అభ్యర్థికి 10 వేల ఓట్లు కూడా రావని చెప్తూ వచ్చామని, ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ సహకరించకుంటే ఆ పార్టీ కార్యాలయానికి కూడా తాళాలు వేయడం ఖాయమని వ్యాఖ్యానించారు.

