Ponnam Prabhakar: బీరు, బిర్యానీ సంస్కృతి తెచ్చింది కేటీఆర్‌

Ponnam Prabhakar: బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఆయన కేటీఆర్‌పై విరుచుకుపడుతూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ –ఇళ్ల కూల్చివేతలపై కేటీఆర్‌ మాట్లాడటం నిజంగా విడ్డూరం అన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఇళ్ల సమస్యలపై ఎప్పుడైనా స్పందించారా అని ప్రశ్నించారు.

తెలంగాణలో ఎన్నికల సమయంలో బీరు, బిర్యానీ సంస్కృతి తెచ్చింది కేటీఆర్‌నే అని ఆరోపించారు. గతంలో జరిగిన ఉపఎన్నికల్లో డబ్బులు పంచింది కూడా బీఆర్ఎస్‌నే అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

గోపీనాథ్‌పై కేటీఆర్‌కి నిజంగా మమకారం ఉంటే, మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.ఎన్నికలు సమీపిస్తేనే కేటీఆర్‌ ప్రజల దగ్గరికి వస్తారు. ఆ తరువాత మాత్రం కనిపించరని ఎద్దేవా చేశారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *