Ponnam Prabhakar: తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకూ తీవ్రత పెరుగుతోంది. బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని, ప్రజలు తిరస్కరించడంతో తన ఉనికిని నిలబెట్టుకునేందుకు బురద రాజకీతి చేస్తున్నారు అని విమర్శించారు.
“కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురదజల్లుతున్నారు. ఇది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం,” అని మంత్రి పేర్కొన్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను కూడా ఆయన ఆక్షేపించారు. “బీసీని సీఎం చేయాలంటున్న కిషన్‌రెడ్డి నిజంగా బీసీలపై మక్కువ ఉంటే, తన మంత్రి పదవికి రాజీనామా చేసి దాన్ని ఓ బీసీకి అప్పగించాలి,” అని సవాల్ విసిరారు.
పోన్మ్ ప్రభుత్వ పరిపాలనపై హర్షం వ్యక్తం చేశారు. “ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని పూరిస్తూ, అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం,” అని వివరించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి విజయమే లభిస్తుందన్న విశ్వాసాన్ని పొన్నం వ్యక్తం చేశారు.