Ponguleti srinivas reddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జలవిద్యుత్ (హైడల్ పవర్) ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రంతో ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు.
పీక్ అవర్స్‌లో రివర్స్ పంపింగ్
పీక్ అవర్స్ సమయంలో రివర్స్ పంపింగ్ పద్ధతిని వినియోగించి జలవిద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా అధిక విద్యుత్ అవసరాలను తీర్చడంలో రాష్ట్రం ముందడుగు వేస్తుందని చెప్పారు.
250 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ టెండర్లు
జలవిద్యుత్ ఉత్పత్తితో పాటు, బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 250 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ కోసం టెండర్లు పిలిచిన విషయాన్ని మంత్రి వెల్లడించారు. ఇది విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచి, విద్యుత్ సరఫరాలో నిలకడను తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అభివృద్ధి
రాష్ట్రంలోని ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మరింత మెరుగుపరిచామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు విద్యుత్ సరఫరా దృఢంగా ఉంటుందని తెలిపారు.
ఈ చర్యలతో తెలంగాణ రాష్ట్రం పునరుత్పత్తి శక్తి ఉత్పత్తిలో ముందంజ వేస్తుందని, భవిష్యత్తులో మరింత శక్తిసంపత్తి సాధించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రణాళికలతో ముందుకెళ్తుందని మంత్రి వెల్లడించారు.

