ponguleti srinivas reddy : రాష్ట్రంలో భూ ధరలు త్వరలో పెరిగే అవకాశముందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, భూ సర్వే కోసం ప్రతీ మండలానికి సర్వేయర్ మరియు డిప్యూటీ సర్వేయర్‌లను నియమిస్తామని తెలిపారు. ఈ చర్య ద్వారా భూ సర్వే పనులు మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
అలాగే, లైసెన్సు పొందిన సర్వేయర్‌లకు కూడా అవకాశాలు ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,000 లైసెన్సు పొందిన సర్వేయర్‌లకు ట్రైనింగ్ ఇచ్చి, వారికి అవకాశాలు కల్పించనున్నారు.
ఎల్ఆర్ఎస్ స్కీమ్ (LRS) మార్పులు**
ఎల్ఆర్ఎస్ (LRS) స్కీమ్‌కు మార్చి 31 వరకూ గడువు ఉందని, ఆ గడువు లోపు ఎల్ఆర్ఎస్ పథకం కింద పైనిచేసిన వారికి 25 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే, ఈ పథకం ఇప్పుడు కాకుండా, ఇల్లు కట్టేటప్పుడు పర్మిషన్ కావాలంటే, 100 శాతం ఎల్ఆర్ఎస్ కట్టాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
**ప్రధాని ఆవాస్ యోజన – 1 లక్షా 13 వేల ఇళ్ల మంజూరు**
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని ఆవాస్ యోజన కింద అర్బన్ ఏరియాలో 1 లక్షా 13 వేల ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ ఇళ్లకు కేంద్రం 1.50 లక్షలు మాత్రమే అందిస్తుందని, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన వివరించారు. రూరల్ ఏరియా విషయంలో, కేంద్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదని మంత్రి తెలిపారు.
**సాదాబైనామాల దరఖాస్తులపై స్పష్టం**
సాదాబైనామాల విషయంలో కొత్త దరఖాస్తులను మాత్రమే స్వీకరించాలని మంత్రి స్పష్టం చేశారు. 13 లక్షల పాత దరఖాస్తులను గత ప్రభుత్వం రిజెక్ట్ చేసిందని, రిజెక్ట్ చేసిన వారికి అపిలేట్ అథారిటీకి అపీల్స్ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.