Ponguleti srinivas: భూ పంచాదిలకు చెక్…తెలంగాణలో కొత్త నక్షలు.. 

Ponguleti srinivas: తెలంగాణలో నిజాం పాలన కాలం నుంచి భూములపై సరైన సర్వే లేక నష్టపోతున్న 413 గ్రామాలకు త్వరలో మోక్షం కలుగనుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గత పదేళ్లుగా ఈ సమస్యను పరిష్కరించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది అని ఆయన విమర్శించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు.

ప్రారంభంగా ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించి, ఫలితాల ఆధారంగా మిగిలిన గ్రామాల్లో కూడా భూ సర్వే చేపట్టనున్నారు.

పైలట్ ప్రాజెక్ట్‌కు ఎంపికైన గ్రామాలు:

మహబూబ్‌నగర్ జిల్లా, గండీడ్ మండలం – సలార్ నగర్

జగిత్యాల జిల్లా, భీర్పూర్ మండలం – కొమ్మనాపల్లి (కొత్తది)

ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం – ములుగుమడ

ములుగు జిల్లా, వెంకటాపురం మండలం – నూగూర

సంగారెడ్డి జిల్లా, వట్‌పల్లి మండలం – షాహిద్ నగర్

ఈ గ్రామాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా భూ సర్వేలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *