TG MLC Elections: ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ (ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్) రెండు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం (ఉపాధ్యాయ) ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.ఈ మేరకు సంబంధిత జిల్లాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది.కరీంనగర్‌లోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

