Plane Crash

Plane Crash: అజిత్ పవార్ నుంచి వైఎస్సార్ దాకా.. విమాన ప్రమాదాల్లో మరణించిన దిగ్గజ నాయకులు!

Plane Crash: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన వార్త దేశవ్యాప్తంగా విషాదం నింపింది. బారామతిలో జరిగిన ఈ దుర్ఘటనలో ఆయనతో పాటు ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే రాజకీయ చరిత్రలో ఇలాంటి గగనతల ప్రమాదాల్లో చిక్కుకుని కన్నుమూసిన దిగ్గజ నాయకులు చాలామంది ఉన్నారు. ఇటీవల గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించడం కూడా తీవ్ర కలకలం సృష్టించింది. 2016 నుంచి 2021 వరకు గుజరాత్ సీఎంగా పనిచేసిన ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే హాస్టల్ భవనంపై కూలిపోయింది.

Plane Crash

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తెలుగు ప్రజలకు ఒక మాయని గాయం. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు వెళ్తుండగా నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట వద్ద ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. వాతావరణం అనుకూలించకపోవడంతో జరిగిన ఈ దుర్ఘటనలో వైఎస్సార్‌తో పాటు ఉన్నవారంతా కన్నుమూశారు.

Plane Crash

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ 1980 జూన్ 23న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. విమాన విన్యాసాలు చేస్తున్న సమయంలో నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఇది కూడా చదవండి: Ajit Pawar: మహారాష్ట్రలో ఎయిర్ క్రాష్.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Plane Crash

గుజరాత్ రెండో ముఖ్యమంత్రిగా పనిచేసిన1965 యుద్ధ సమయంలో భారత్-పాక్ సరిహద్దు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. పాకిస్తాన్ జెట్ విమానం పొరపాటున ఢీకొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

Plane Crash

కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా కూడా 2001లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన చార్టర్ విమాన ప్రమాదంలో మరణించారు.

Plane Crash

నాటి లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి 2002లో పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. సాంకేతిక లోపం కారణంగా ఆ ప్రమాదం చోటుచేసుకుంది.

గుర్నామ్ సింగ్ - వికీపీడియా

వీరితో పాటు పంజాబ్ మాజీ సీఎం గుర్నామ్ సింగ్ 1973లో ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదం మరణించారు. అరుణాచల్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ మెరిట్ స్కాలర్‌షిప్‌ను పెంచారు, తవాంగ్‌లో  కొత్త కాలేజీ బ్లాకులను ప్రారంభించారు

అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు 2011లో చైనా సరిహద్దు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

Plane Crash

హర్యానా మంత్రి ఓపీ జిందాల్ కూడా 2005లో జరిగిన ఇటువంటి ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు దేశ రాజకీయాల్లో తీరని లోటును మిగల్చడమే కాకుండా, వీవీఐపీల విమాన ప్రయాణాల్లో భద్రతపై ఎప్పుడూ చర్చకు దారితీస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *