Political News:ఇటు ఎన్డీయే, అటు ఇండియా కూటములు కాకుండా, మధ్యే మార్గంగా వైసీపీ, బీఆర్ఎస్ కూటమి కట్టాలని భావిస్తున్నాయా? ఇప్పటికే మంతనాలు జరిగాయా? రెండు పార్టీలూ అంగీకరించాయా? అంటే కావచ్చు.. అన్న సంకేతాలు అందుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
Political News:వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూటమిగా ఏర్పడటానికి కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే.. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీ పాత్ర బీఆర్ఎస్ పోషిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయ ప్రతిపక్ష పాత వైసీపీ పోషిస్తున్నది. దీంతో ఈ రెండు పార్టీ దేశంలోని ఆ ప్రధాన కూటములైన ఎన్డీయే, ఇండియా కూటములకు వ్యతిరేకమేనన్నమాట.
Political News:ఎలాగూ ఆ రెండు కూటముల్లోకి వెళ్లలేరు కనుక బీఆర్ఎస్, వైసీపీ కలిసి రాజకీయాలు చేస్తే బలంగా ఉంటామని మాత్రం నమ్ముతున్నారు. జగన్ తొలుత ప్రధాని మోదీపై కొంత సానుకూలంగా ఉన్నా, తాజాగా మోదీ కార్యక్రమాల్లో జరిగే అవినీతి అవకతవకలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అదే విధంగా కేసీఆర్ నేరుగా ప్రెస్మీట్ పెట్టి ప్రధాని మోదీ వల్లే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ధ్వజమెత్తుతున్నారు. దీంతో ఈ రెండు పార్టీలు ఎన్డీయే కూటమిలో కలవబోవని తేలిపోయింది.
Political News:ఈ రెండు పార్టీలకు మరో భయం వెంటాడుతుంది. ఒకవేళ కాంగ్రెస్ కూటమిలోకి వెళ్తే ఎక్కడ కేసుల పాలవుతామోనన్న భయం ఉంటుంది. బీజేపీ కూటమిలోకి వెళ్తే ఈ రెండు పార్టీలు నిర్వీర్యం కాక తప్పదు. బీజేపీదే ఆధిపత్యం చాటుకుంటుంది. చాపకింది నీరులా విస్తరించి, ఆ రెండు పార్టీలను కబలించి వేస్తుంది. ఇతర రాష్ట్రాల మాదిరిగా బీజేపీ అధికారంలోకి వచ్చే చాన్స్ ఉంటుంది.
Political News:ఈ దశలో బలమైన శక్తులుగా మారాలంటే వైసీపీ, బీఆర్ఎస్ కూటమిగా ఏర్పడితే ఇటు రాష్ట్రంలో ప్రత్యర్థులకు పోటీనివ్వగలవు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే కూటమికి అవసరమైతే భాగస్వాములై రాష్ట్రాలకు ప్రాతినిథ్యం సాధించవచ్చని భావిస్తున్నాయి. కేంద్రంలో వచ్చే ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పవచ్చిన ఇటు కేసీఆర్, అటు జగన్ భావిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో వీరిద్దరూ స్నేహిపూర్వకంగా ఉంటున్నారని భావిస్తున్నారు.
