Hyderabad: హైదరాబాద్‌లో ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఇద్దరు అనుమానితులు అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల సంయుక్త ఆపరేషన్‌లో ఈ కీలక ఘట్టం జరిగింది. అరెస్ట్ చేసిన వారిని సిరాజ్ ఉర్ రెహమాన్ (29) మరియు సయ్యద్ సమీర్ (28)గా గుర్తించారు. వీరిద్దరూ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు, సౌదీ అరేబియాలో ఉన్న ఐసిస్ మాడ్యూల్ నుంచి దిశానిర్దేశాలు పొందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వారి వద్ద నుంచి అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ వంటి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సిరాజ్ వీటిని విజయనగరం నుండి సేకరించినట్టు తెలిసింది. అతని విచారణలో, హైదరాబాదులోని సమీర్ పేరు వెలుగులోకి రావడంతో, అతనిని అక్కడ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరు అనుమానితులూ విచారణలో ఉన్నారు. త్వరలోనే న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నారు.
అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

