Murder Case Solved: నిజం నిప్పు లాంటిది.. పోలీసులు నిప్పు లాంటి వారు.. దొంగతనం చేసిన.. హత్య చేసినా.. చిన్న క్లూ దొరికిన శ్రీకృష్ణ జన్మష్టానికి పంపిస్తారు.. క్షణికా సుఖం కోసం జీవితంతం తోడుగా ఉంటాను అని… అగ్ని సాక్షిగా..బంధువుల సాక్షిగా.. మూడు ముళ్లు వేయించుకున్న ఆ మహిళ…భర్తను కాదని, వేరే వాడితో వివాహిత సంబంధం పెట్టుకుంది. దొంగతనం అయినా.. ఆ తనం అయినా.. బయట పడక తప్పదు. ఆమెను అతి దారుణంగా చంపారు.. ఈ విషయాన్ని అందరూ మర్చిచి పోతుండగా.. మన పోలీసులు ఏం చేశారో చూడండి.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో గత నెల జనవరి 27న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం బెల్లంపల్లి పట్టణానికి చెందిన మేడ మమత అనే మహిళ తన భర్త భరత్‌తో విభేదాల కారణంగా మంచిర్యాలలో ఉంటోంది. ఒంటరిగా ఉంటూ సింగరేణి ఉద్యోగి భాస్కర్‌తో పరిచయం ఏర్పడి అతనితో సాన్నిహిత్యంగా ఉంటుంది. వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
ఇది కూడా చదవండి: Crime News: కొడుకు స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చాడని కొట్టిన తండ్రి.. ప్రాణాలిడిసిన బాలుడు
ఈ వ్యవహారాన్ని గమనించిన భాస్కర్ సోదరి నర్మద తన ప్రియుడు రఘుతో కలిసి మేడ మమత హత్యకు పథకం సిద్ధం చేశారు. సుపారీ హంతకుడు వేల్పుల కల్యాణ్‌కు రూ.5 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మేడ మమతను కల్యాణ్ హత్య చేసిన అనంతరం నర్మద బావ వెంకటేష్, తండ్రి రాజలింగులు హంతకుడికి రూ.5 లక్షలు చెల్లించారు.
మృతదేహాన్ని సుపారీ హంతకుడు వేల్పుల కల్యాణ్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో పడేశాడు. ఈ ఘటన అనంతరం కల్యాణ్ చెన్నై పారిపోగా, పోలీసులు సమాచారం అందుకుని నిందితుడిని పట్టుకున్నారు. మిగతా నలుగురు నిందితులను వారి ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరు పరిచారు.