Battula prabhakar

Battula prabhakar: దక్షిణాది రాష్ట్రాల్లో 80 దొంగతనాలు

Battula prabhakar: గచ్చిబౌలిలోని ప్రిజం పబ్బులో పోలీసుల మీద కాల్పులు జరిపిన నిందితుడు బత్తుల ప్రభాకర్‌ నేరచరిత్ర చూసి పోలీసులు విస్తుపోతున్నారు. 2022 మార్చిలో విశాఖ జైలు నుంచి పరారైన అతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 80 చోరీ కేసులు ఉన్నట్లు గుర్తించారు. అందులోనూ.. కేవలం 11 చోరీల్లోనే రెండున్నర కోట్లు కొట్టేశాడు. ఈ డబ్బులతో ఖరీదైన కార్లు కొంటూ.. పబ్బుల్లో గడుపుతూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఇలా మూడేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. కానీ.. బ్యాడ్‌ లక్‌.. రెండు రోజులు గచ్చిబౌలి ప్రిజమ్‌ పబ్‌ దగ్గర పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు.

బత్తుల ప్రభాకర్‌ను అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ పోలీసులు.. 14 రోజుల కోర్టు రిమాండ్‌తో జైలుకు తరలించారు. అయితే.. బత్తుల ప్రభాకర్‌ కేసు విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్‌ ఛాతిపైనున్న టాటూ ఆధారంగా కీలక విషయాలు ఛేధించారు. ఇంజనీరింగ్ కాలేజీలే టార్గెట్‌గా ప్రభాకర్‌ చోరీలకు పాల్పడ్డాడు. సుమారు రెండున్నర కోట్ల రూపాయల వరకు కాజేశాడు. మూడు కోట్ల రూపాయలు చోరీ చేసేందుకు టార్గెట్‌ పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

బత్తుల ప్రభాకర్‌ కేసులో మరో సంచలన కోణమూ బయటపడింది. తొమ్మిది పేర్లు మార్చుకొని కొట్టేసిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న ప్రభాకర్‌.. వందమంది అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. చోరీల విషయంలో ఎవరైనా అడ్డొస్తే కాల్పులు జరిపేందుకు హైదరాబాద్ శివారులో షూటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తన టార్గెట్స్‌ అన్నింటినీ సినిమా లెవెల్లో బోర్డుపై స్క్రిప్ట్‌ రాసుకుని మరీ ప్లాన్‌లు అమలు చేస్తున్నట్లు తేల్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *