Ambati Rambabu: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల (జూన్ 18)లో పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా అంబటి రాంబాబు పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
గతంలో సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు కాగా, తాజాగా గ్రామీణ పోలీసు స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి రజనీతో పాటు పలువురు జిల్లా నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 118 మందిపై కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: Bandi sanjay: ఈటల రాజేందర్ వ్యాఖ్యల ఫలితం.. బండి సంజయ్ ఏమన్నారంటే?
ఇప్పటికే పలువురిని పోలీసులు విచారించగా, అంబటి రాంబాబును కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. జూలై 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.