Head Constable: పోలీసు డ్యూటీల్లో దొంగల్ని పట్టుకోవడం ఒకటి. ముఖ్యమైన పని కూడా అదే. దొంగలకు పోలీసులను చూస్తే దడ పట్టుకోవాలి. అలాంటిది. దొంగతనాలు ఎలా చేయాలో ట్రైనింగ్ ఇచ్చి మరీ దొంగతనాలు చేయిస్తున్నాడు ఒక పోలీసు అధికారి. వినడానికి ఇది నిజంలా కనిపించకపోయినా.. ఆ పోలీసును అరెస్ట్ చేశారని చెబితే నమ్ముతారు కదూ.
ఇళ్లలోకి చొరబడి దోచుకోవడానికి వ్యక్తులకు శిక్షణ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. చిక్కబళ్లాపూర్‌లో ఇళ్లలో చోరీలు, దోపిడీలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 20న గౌరిపిటనూర్‌లోని శ్రీనివాస్ ఇంట్లోకి ఒక రహస్య ముఠా చొరబడి బంగారు నగలు, వజ్రాలను దోచుకుంది.దర్యాప్తు చేపట్టిన గౌరిపిటనూర్ పోలీసులు రౌడీలు తన్వీర్, సాబీర్, ఫిరోజ్, బషీర్ అహ్మద్, ఇర్ఫాన్ పాషా, బాబాజాన్, అమీన్ లను అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Constable Duty: రాత్రిళ్లు నా భార్య రక్తం తాగేస్తోంది.. డ్యూటీకి లేట్ అందుకే .. కానిస్టేబుల్ కహానీ వైరల్
విచారణలో, హెన్నూర్ ట్రాఫిక్ పోలీస్ చీఫ్ అట్టు ఇలియాస్ ఇళ్లలోకి చొరబడి దోచుకోవడానికి తమకు శిక్షణ ఇచ్చాడని వారు వెల్లడించారు. దీంతో అవాక్కయిన పోలీసులు తరువాత, ఇలియాస్‌ను కూడా అరెస్టు చేశారు. దొంగలకు పోలీసు శిక్షణ ఇస్తున్నాడనే విషయం అక్కడి పోలీసు వర్గాల్లో కలకలం రేపింది.