Rajahmundry: రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని సోనోవిజన్ వీధిలో అర్ధరాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. నలుగురు యువకులు మద్యం తాగి హంగామా చేస్తూ ఉండగా, రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వారిని చూసి, “ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్లిపోండి” అని చెప్పారు. దీంతో ఆ యువకులు కానిస్టేబుల్‌పై వాగ్వాదానికి దిగారు. కోపంతో విచక్షణ కోల్పోయిన యువకులు కానిస్టేబుల్‌పై దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆ నలుగురు యువకులు కానిస్టేబుల్‌పై దాడి చేశారు. పోలీసులను తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు రాత్రి వేళల్లో ఇలాంటి అల్లరి చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం, ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. నెటిజన్లందరూ ఆ కానిస్టేబుల్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడేవారికే ఈ పరిస్థితి వస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
మద్యం తాగి అర్ధరాత్రి హంగామా, ప్రశ్నించినందుకు పోలీసులు మీద దాడి!
రాజమండ్రిలో దారుణ సంఘటన🤦♂️
కోటిపల్లి బస్టాండ్ సోనోవిజన్ వీధిలో రాత్రి నలుగురు కుర్రోళ్ళు ఉండడం చూసి నైట్ బీట్ కానిస్టేబుల్ ఇక్కడ పని ఏంటి వెళ్లిపోండి అన్న పాపానికి పోలీసులపై విచక్షణ కోల్పోయి దాడి చేసిన యువకులు‼️ pic.twitter.com/DNrl8Zf68Z
— Bhaskar Reddy (@chicagobachi) September 8, 2025

