Vidya Sagar: ముంబయికి చెందిన సినీనటి కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు బనాయించి వేధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చెల్లని చెక్కుతో భారీ మోసం
చెన్నైలో విద్యాసాగర్‌పై ఓ కంపెనీని రూ. కోట్లలో మోసం చేసిన ఆరోపణలు ఉన్నాయి. చెల్లని చెక్కుతో మోసపూరిత లావాదేవీలు చేసినందుకు సంబంధించి చెన్నైలో కేసు నమోదైంది. ఈ కేసులో చెన్నై న్యాయస్థానం విద్యాసాగర్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగో సారి ఇలా..
ఏపీ సీఐడీ ఎదుట హాజరుకావాల్సిన విద్యాసాగర్ అరెస్ట్
విద్యాసాగర్ జెత్వానీ కేసులో విచారణ కోసం శనివారం ఏపీ సీఐడీ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉండగా, చెన్నై పోలీసులు విజయవాడకు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విద్యాసాగర్‌ను విచారణ కోసం చెన్నైకి తరలించినట్లు సమాచారం.
మరిన్ని మలుపులు తిరిగే అవకాశం
ఈ అరెస్టుతో జెత్వానీ కేసు, చెక్ బౌన్స్ కేసు తదితర అన్ని ఆరోపణలపై విచారణ వేగంగా కొనసాగనున్నట్లు సమాచారం. విద్యాసాగర్ అరెస్టుతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.