Polavaram Project: కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఒకవైపు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈలోగా పోలవరం నిధుల విషయంలో కీలక ప్రకటన వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ కోసం ఒకేసారి 2800 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అందులో 2 వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారని తెలుస్తోంది. ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న పోలవరం నిధుల విషయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఊరట కలిగించే నిర్ణయంగా చెప్పుకోవచ్చు.
Polavaram Project: నిజానికి కొన్ని రోజుల క్రితమే కేంద్ర మంత్రివర్గం పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగానే ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా విడుదల చేసింది. అంటే పోలవరం నిధుల విషయంలోనూ, ఏపీకి సంబంధించిన విషయాల్లోనూ కేంద్రం వేగంగా స్పందిస్తున్నట్లు భావించవచ్చు. అంతేకాకుండా, రీయంబర్స్ మెంట్ కింద మరో 800 కోట్లను విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం 2,800 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వానికి అందుతాయి. ఇది పెద్ద రిలీఫ్ ఏపీ ప్రభుత్వానికి.
Polavaram Project: నిజానికి పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. అంటే, కేంద్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలు చూడాలి. కానీ, అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేసే విధంగా.. దానికి అయినా ఖర్చును కేంద్రం రియంబర్స్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో అదేవిధంగా వేగంగా ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగాయి. తరువాత ప్రభుత్వం మారింది. పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్ట్ పనులు కూడా రివర్స్ అయ్యాయి. ఇప్పుడు ఒక సీజన్ నష్టపోకుండా పనులు ముందుకు సాగాలంటే ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు అడ్వాన్స్ గా కావాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని పదే, పదే కోరుతూ వచ్చింది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు తొలిసారిగా కేంద్రం అడ్వాన్స్ గా నిధులను విడుదల చేయాలనీ నిర్ణయించింది.

