Adilabad

Adilabad: ఆదిలాబాద్ లో స్కూల్ పిల్లలపై విషప్రయోగం..

Adilabad: ఆదిలాబాద్ లో దారుణం జరిగింది.. గవర్నమెంట్ స్కూల్ పిల్లలపై విషయప్రయోగం కలకలం రేపింది. జిల్లాలోని ఇచ్చోడ మండలం ధరంపురి గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్ లో జరిగింది ఈ దారుణం. ఏప్రిల్ 16 జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. ఉదయాన్నే స్కూల్ కి వచ్చిన హెడ్ మిస్ట్రెస్ స్కూల్ ఆవరణలో పురుగుల మందు డబ్బాలు పడి ఉండటం.. వాటర్ ట్యాంకులో నీళ్ళు, వంట సామాగ్రి పురుగుల మందు వాసన రావడంతో అప్రమత్తమయ్యానని.. తాగునీటిలో పురుగుల మందు కలిసిందని నిర్దారించుకున్న తర్వాత పిల్లలు తాగునీటి ట్యాంకు వైపు వెళ్లకుండా ఆపానని తెలిపారు.

మధ్యాహ్న భోజనం ఇంకా వండకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు స్కూల్ సిబ్బంది. స్కూల్లో 30 మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలుస్తోంది. విష ప్రయోగం నుండి 30 మంది విద్యార్థులు క్షేమంగా బయట పడడంతో ఊపిరి పీల్చుకున్నారు స్కూల్ సిబ్బంది, గ్రామస్థులు.

Also Read: Rammohan Naidu: యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎంపికైన రామ్మోహన్ నాయుడు

Adilabad: మధ్యాహ్న భోజనపు గంజులలో సైతం విషం పూసినట్లు గుర్తించామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు చేశారు హెడ్ మిస్ట్రెస్. కేసు నమోదు చేసిన పోలీసులు విషం ఎవరు కలిపారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అభం శుభం తెలియని స్కూల్ పిల్లలపై విషయప్రయోగం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది.. చిన్న పిల్లలు ఏం పాపం చేశారని వారిపై విషప్రయోగం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *