PM Narendra Modi:ఇప్పటివరకూ భారతదేశ ప్రధానమంత్రిగా అత్యధిక కాలం పాలించిన మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ రికార్డును ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధిగమించారు. ఈ రోజుతో (జూలై 25) మోదీ ప్రధానిగా 4,708 రోజుల కాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా 4,707 రోజులపాటు పదవిలో కొనసాగారు. ఎలాంటి విరామం లేకుండా అటు ప్రధానిగా ఇందిరాగాంధీ పాలించగా, ఆమె పేరిట ఉన్న రికార్డును ఎలాంటి విరామం లేకుండా వరుస ప్రధానిగా నరేంద్ర మోదీ అధిగమించారు.
PM Narendra Modi:దివంగత ఇందిరాగాంధీ 1966 జనవరి 24వ తేదీ నుంచి 1977 మార్చి 24 వరకు 4,707 రోజులపాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. అంతకు ముందు ఆమె తండ్రి, దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆ రికార్డును సాధించారు. ప్రస్తుతం 2014 మే 26న నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు.
PM Narendra Modi:వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని అందించిన ఘనత నెహ్రూ, నరేంద్ర మోదీలకు దక్కింది. స్వాతంత్రానంతరం జన్మించి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెసేతర వ్యక్తిగా కూడా మోదీ రికార్డులకెక్కారు. లోక్‌సభలో రెండుసార్లు పూర్తిస్తాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర పార్టీ నేతగా కూడా మోదీ చరిత్ర తిరగరాశారు. ఇందిరాగాంధీ (1971) అత్యధిక మెజార్టీతో అధికారం చేపట్టిన ప్రధానిగా కూడా మోదీ నిలిచారు.
PM Narendra Modi:అదే విధంగా సీఎంగా, ప్రధానిగా దీర్ఘకాలం కొనసాగిన ఘనతను సైతం మోదీ సొంతం చేసుకున్నారు. 2001 అక్టోబర్ 7న తొలిసారి మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో ప్రధాని అయ్యే వరకూ ఆ పదవిలో కొనసాగారు. అప్పటి నుంచి ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుజరాత్ సీఎంగా 2002, 2007, 2012 వరుస ఎన్నికల్లో మోదీ బీజేపీని విజయతీరాలకు చేర్చారు.
PM Narendra Modi:ఇటు 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా బీజేపీని నరేంద్ర మోదీ అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులందరిలో వరుసగా ఆరు ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నాయకుడిగా నరేంద్ర మోదీ రికార్డు సాధించారు. ఇలా పలు విషయాల్లో ఆయన ఘనత వహించడం విశేషం.