Narendra Modi

Narendra Modi: విద్యార్థులతో పరీక్షా పే చర్చ..

Narendra Modi: పిల్లలు సూర్యస్నానం చేయాలి అలాగే  రైతుల ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం కూడా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పిల్లలతో మాట్లాడుతూ..  రైతులు ఉదయం పెద్ద భోజనం చేస్తారని, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పెద్ద భోజనం చేస్తారని ఆయన అన్నారు. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా  ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అన్నారు. 

ప్రతి విద్యార్థి సూర్య స్నానాన్ని అలవాటు చేసుకోవాలి, ఉదయాన్నే వెళ్లి ఎండలో కూర్చోవాలి. మీ శరీరంలోని ఎక్కువ భాగాన్ని సూర్యరశ్మికి లో ఉంచే ప్రయత్నం చేయాలి. ఇంకా, శారీరక పోషణ  ప్రాముఖ్యతను వివరిస్తూ, “గోధుమలు, జొన్నలు, బియ్యం, ప్రతిదీ తినండి. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఎక్కువ సమయం గడపాలి అని సూచించారు.

గతసారి 30 మార్కులు వస్తే, ఈసారి 35 మార్కులు రావాలని మీరు అనుకోవాలి. క్రమంగా మీ మనసును స్థిరపరచుకోవాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. పిల్లలు విచారంగా, అలసిపోతే పరీక్షల్లో బాగా రాయగలరా? అని అడిగాడు.

ఇది కూడా చదవండి: Meerpet Murder: మీర్‌పేట మ‌హిళ హ‌త్య‌కేసులో మ‌రో ముగ్గురి హ‌స్తమున్న‌దా? వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు

అందరికీ 24 గంటలే సమయం ఉంటుంది. దాని కొంతమంది సరిగా వాడకుండా వృధా చేస్తున్నారు. మరి కొందరు అలాకాదు వాళ్లకి ఉన్న సమయంలో తమ లక్ష్యంపై దృష్టి పెడతారు దాని కోసం కష్టపడి పనిచేస్తారు. ఈ సమయాన్ని సాధ్యమైనంత ఉత్తమంగా ఉపయోగించుకోవాలి. నేను రేపు చేయవలసిన పనుల జాబితాను తయారు చేసుకుంటాను అని అన్నారు.

దీనివల్ల తర్వాత రోజు మనం చేయవలసిన పన్నులు ముందుగానే తెలియడంతో వాటిపైన ద్రుష్టి పెడతాం. అందులో ముఖ్యమైన వాటికీ మరింత సమయం కేటాయిస్తాం. వీటితోపాటు ఇతర విషయాలకు కూడా సమయం ఇవ్వాలని ఆయన వారికి సూచించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *