PM Narendra Modi:

PM Narendra Modi: ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌కు ఏర్పాట్లు క‌ట్టుదిట్టం.. మ‌ధ్యాహ్నం అట్ట‌హాసంగా అమ‌రావ‌తి పునఃప్రారంభం

PM Narendra Modi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాట్ల‌ను క‌ట్టుదిట్టం చేసింది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి న‌గ‌ర పునఃప్రారంభ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. శుక్ర‌వారం (మే 2న‌) మ‌ధ్యాహ్నం ప్ర‌ధాని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌కు 3.00 గంట‌ల‌కు చేరుకోనున్నారు. ప్ర‌ధాని రాక సంద‌ర్భంగా భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

PM Narendra Modi: గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్‌లో ప్ర‌ధాని మోదీకి మంత్రులు, కూట‌మి నేత‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లుక‌నున్నారు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ ద్వారా వెల‌గపూడి స‌చివాల‌యం వ‌ద్ద ఉన్న హెలిపాడ్‌కు చేరుకుంటారు. హెలిపాడ్ వ‌ద్ద సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఘ‌నంగా స్వాగ‌తం ప‌లుకుతారు. పుష్ప‌గుచ్ఛాలు, శాలువాల‌తో ఘ‌నంగా స‌త్క‌రిస్తారు.

PM Narendra Modi: ప్ర‌ధాన రాక సంద‌ర్భంగా భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల వ‌ర‌కు స‌భాస్థ‌లికి చేరుకొని అమ‌రావ‌తి పునఃప్రారంభ కార్యక్ర‌మంలో ప్ర‌ధాని పాల్గొంటారు. అనంత‌రం వివిధ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌ల‌తోపాటు వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుట్ట‌నున్నారు. ఆ త‌ర్వాత 5 గంట‌ల‌కు హెలికాప్ట‌ర్ ద్వారా గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్క‌డి నుంచి విమానంలో ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్తారు.

PM Narendra Modi: ప్ర‌ధాన మోదీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో స‌భా స్థ‌లికి 5 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు నో ఫ్లై జోన్‌గా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆ ప్రాంతంలో ఎవ‌రూ డ్రోన్ ఎగుర‌వేయడానికి అనుమ‌తి ఉండ‌బోద‌ని డ్రోన్ కార్పొరేష‌న్ అధికారులు వెల్ల‌డించారు. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ ప‌రిస‌రాల్లో కూడా ఇవే నిబంధ‌న‌లు ఉంటాయ‌ని అధికారులు తెలిపారు. ఆయా చోట్ల బెలూన్ల‌ను కూడా ఎగుర‌వేయొద్ద‌ని గుంటూరు రేంజ్ ఐజీ స‌ర్వ‌శ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు.

PM Narendra Modi: స‌భ‌కు వ‌చ్చే జ‌నానికి ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను రెవెన్యూ అధికారుల‌కు ప్ర‌భుత్వం అప్ప‌గించింది. సుమారు 100 ఆర్డీవోల‌ను ర‌ప్పించింది. 200 మంది త‌హ‌సీల్దార్లు, మ‌రో 200 మంది స‌ర్వేయ‌ర్లు క‌లిసి స‌భ‌కు వ‌చ్చే వారికి సౌక‌ర్యాలు, పార్కింగ్ స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోనున్నారు.

PM Narendra Modi: స‌భా స్థ‌లి వ‌ద్ద అత్య‌వ‌స‌ర వైద్యం కోసం 30 వైద్య బృందాల‌ను ఏర్పాటు చేశారు. అదే విధంగా 21 ప్ర‌త్యేక అంబులెన్స్‌ల‌ను సిద్ధంగా ఉంచారు. మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌, మ‌రో కార్పొరేట్ ఆసుప‌త్రిలో ప్ర‌త్యేక వార్డుల‌ను అత్య‌వ‌స‌ర వైద్యం కోసం కేటాయించారు. మంత్రుల బృందం స‌భ్యులైన ప‌య్యావుల కేశవ్‌, నారాయ‌ణ‌, నాదేండ్ల మ‌నోహ‌ర్‌, కొల్లు ర‌వీంద్ర స‌భా ప్రాంగ‌ణంలో ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *