PM Narendra Modi: దేశ ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ నగరానికి రానున్నారు. విశాఖలో నిర్వహించనున్న ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విశాఖ జిల్లా అధికారులకు సమాచారం అందింది. విశాఖపట్నంలో ఏటా ఆంధ్ర విశ్వవిద్యాలయం, తూర్పు నౌకాదళం, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో వేర్వేరుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ మూడింటిలో ఏదో ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారని సమాచారం. ఏది అనేది తెలియరాలేదు.
PM Narendra Modi: ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ 2024 జూన్ 21న నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం ప్రదాయనిగా, ఒత్తిడి నివారిణిగా యోగా విశిష్టత ఎనలేనిదని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరమైన అమరావతి పునఃప్రారంభోత్సవానికి ఇటీవలే మోదీ హాజరై వెళ్లారు.
