PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐదేండ్లలో విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా రూ.362 కోట్లు. ఇటీవల జరిపిన 9 దేశాల పర్యటనల ఖర్చు జమ కాకుండానే ఇంత ఖర్చయింది అన్నమాట. ఇది ఓ పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా తెలిపిన వివరాలు ఇవి.
PM Narendra Modi: 2021వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు ప్రధాని మోదీ విదేశీ పర్యటనల వివరాలు వెల్లడించాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ఓ బ్రియాన్ ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. దీనికి కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకమైన సమాధానం ఇచ్చింది. 2021-2024లో విదేశీ పర్యటనలకు రూ.295 కోట్లు ఖర్చైనట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది.
PM Narendra Modi: ఈ ఏడాది అమెరికా,ప్రాన్స్ సహా 5 దేశాల పర్యటనలకు రూ.67 కోట్లు కలిపితే ఖర్చు రూ.362 కోట్లు ఖర్చయిందని కేంద్రం వెల్లడించింది. ఇటీవల మారిషస్, కెనడా, బ్రెజిల్ వంటి 9 దేశాల పర్యటనల ఖర్చును కేంద్రం వెల్లడించలేదు. ఆ ఖర్చు కూడా కలిపితే సుమారు రూ.400 కోట్లు దాటుతుందని అంచనా. ఇదన్నమాట మ్యాటర్.