PM Narendra Modi: మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కువైట్ దేశ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆ దేశంలో ఆయన రెండు రోజులు పర్యటించనున్నారు. ఆదేశ రాజు ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు ప్రధాని కువైట్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో అక్కడి దేశ అగ్ర నాయకులతోపాటు అక్కడ నివాసం ఉంటున్న భారతీయును ప్రధాని మోదీ కలుసుకోనున్నారు.
PM Narendra Modi: ఇదిలా ఉంటే.. భారతదేశం నుంచి ఒక ప్రధాని కువైట్ దేశానికి వెళ్లడం 43 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. భారతదేశం-కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. మోదీ తన పర్యటనలో భారత కార్మిక శిబిరాన్ని కూడా సందర్శిస్తారు. ఇదే పర్యటనలో అరేబియా గల్ఫ్ కప్, ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉన్నది.
PM Narendra Modi: భారతదేశం దేశ ప్రధాని మోదీ, కువైట్ రాజు మధ్య రక్షణ, వాణిజ్యంతో పాటు ఇతర కీలక రంగాలకు చెందిన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నది. ఈ పర్యటనకు ముందు కువైట్‌లో హలా మోదీ అనే ప్రత్యేక కార్యక్రమంలో మోదీ పాల్గొని, సుమారు 5 వేల మంది భారతీయులను కలుసుకుంటారు.