PM Modi:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ప్రధాని నరేంద్ర మోదీ ఓ మంచి స్నేహితుడిగా గుర్తించడం విశేషం. చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకొని ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఈ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.
PM Modi:”నా మంచి స్నేహితుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు. రాష్ట్రంలో భవిష్యత్తు రంగాలపై దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరంగా కృషి చేస్తున్న తీరు ప్రశంసనీయం. ఆయన దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నా” అని ఆయన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
PM Modi:ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ సోమవారమే (ఏప్రిల్ 21) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఏపీలో పర్యటించే ప్రధాని రాజధాని నగరమైన అమరావతి పునర్‌నిర్మారణ పనులను ప్రారంభించనున్నారు. అదే విధంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పొగడ్తలతో కూడిన విషెస్ చెప్పడం గమనార్హం.