PM modi: 8 తారీకు మహిళల ఖాతాల్లో 2 వేల 500 వేస్తాం..

Pm modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఫిబ్రవరి 8న బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల ఖాతాల్లో రూ.2,500 చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు.

ఆర్కే పురంలో జరిగిన ఈ సభలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ప్రజలను మోసం చేస్తూ ఆప్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గుడిసెను కూడా తొలగించబోమని, అన్ని సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తామని ప్రధాని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, ఆరోగ్య రంగంలో ఆప్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని మోదీ ఆరోపించారు. ప్రజల నుంచి అక్రమంగా దోచుకున్నవారంతా తిరిగి ఆ సొమ్మును చెల్లించాల్సిందేనని హెచ్చరించారు.

పన్నుల వ్యవస్థపై వ్యాఖ్యలు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ హయాంలో రూ.12 లక్షల ఆదాయంపై నాల్గవ వంతు పన్ను విధించేవారని, ఇందిరా గాంధీ హయాంలో అయితే రూ.12 లక్షల ఆదాయంపై దాదాపు రూ.10 లక్షలు పన్నుగా చెల్లించాల్సి వచ్చేదని మోదీ గుర్తుచేశారు. పదిహేనేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.12 లక్షలు సంపాదిస్తే, దానిపై రూ.2.60 లక్షలు పన్నుగా కట్టాల్సి వచ్చేదని చెప్పారు. కానీ, బీజేపీ తాజా బడ్జెట్ ప్రకారం, ఏడాదికి రూ.12 లక్షలు సంపాదించే వ్యక్తులు ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు.

ఢిల్లీలో కొత్త వసంతం

సోమవారం వసంత పంచమి వచ్చిన తర్వాత వాతావరణంలో మార్పులు మొదలవుతాయని, అదే విధంగా, ఫిబ్రవరి 5న ఢిల్లీలో అభివృద్ధి దిశగా కొత్త వసంతం ప్రారంభమవుతుందని మోదీ చెప్పారు. ఢిల్లీలో ఓటింగ్‌కు ముందే ఆప్ పార్టీ బలహీనపడుతోందని, ఆ పార్టీ నాయకులు వరుసగా పార్టీని వీడిపోతున్నారని పేర్కొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *