PM Modi: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (జూన్ 13)న పరిశీలించారు. అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఘటన జరిగిన తీరును స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. సంబంధిత అధికారుల నుంచి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
PM Modi: ప్రధాని మోదీ ఘటనా స్థలం నుంచి నేరుగా సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని అక్కడి వైద్యులకు ఆయన సూచించారు. త్వరగా వారు కోలుకోవాలని ఆకాంక్షించారు.
PM Modi: అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నివాసిత ప్రాంతాలపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 265 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం నుంచి ఒకరు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. వీరిలో విమానం పడిన భవనంలో నివసించే వైద్య విద్యార్థులు 24 మంది దుర్మరణం పాలయ్యారు.