PM Modi: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజును పురస్కరించుకొని శుక్రవారం (జూన్ 20) ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను స్వయంగా కలిసి పూలబొకేను అందించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె జీవితం, నాయకత్వం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ప్రజాసేవ, సామాజిక న్యాయం పట్ల ఆమె నిబద్ధత ఆశను, బలాన్ని ఇస్తుందని కొనియాడారు. పేదలు అణగారిన వర్గాల కోసం ఆమె చేసిన, చేస్తున్న కృషి మరువలేనిదని పేర్కొన్నారు.
