PM Modi: హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు మృతులకు సంతాపం, వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తంచేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
PM Modi: ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు పరిహారం ప్రకటించారు. పాతబస్తీ అగ్నిప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అదే విధంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున అందజేస్తామని తెలిపారు.