PM Modi Mann ki Baat: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు 124వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారమైన ఈ కార్యక్రమంలో ప్రధాని పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
అంతరిక్ష రంగం, ‘నేషనల్ స్పేస్ డే’పై పిలుపు:
ప్రధాని మోదీ అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇటీవల వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చాక దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, ఇది దేశానికి గర్వకారణమని మోదీ అన్నారు. ఆగస్టు 23న ‘నేషనల్ స్పేస్ డే’ రాబోతుందని గుర్తు చేస్తూ, ఈ రోజును పురస్కరించుకొని ప్రజలు తమ సలహాలు, సూచనలను ‘నమో యాప్’ ద్వారా పంపాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ఇన్‌స్పైర్ మానక్’ కార్యక్రమం కింద ప్రతి పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థుల ఆలోచనలను ప్రదర్శిస్తున్నట్లు కూడా ప్రధాని తెలిపారు. త్వరలో ముంబైలో ఆస్ట్రానమీ లేదా ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ జరగనుందని, ఇందులో భారత్ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.
Also Read: Odisha: పూడ్చిపెట్టిన కొన్నిరోజులకే శవాల మిస్సింగ్.. ఆ ఊరిలో వింత సంఘటనలు
వివిధ రంగాల్లో భారతీయులు అంతర్జాతీయంగా గుర్తింపు పొంది, అవార్డులు గెలుచుకుంటున్నారని మోదీ వివరించారు. ముఖ్యంగా, యునెస్కో ఇటీవల 12 మరాఠా కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. వీటిలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జన్మించిన కోట కూడా ఉందని తెలిపారు. అలాగే, తమిళనాడులో మరొకటి కూడా గుర్తించబడిందని ప్రధాని వెల్లడించారు. ఈ గుర్తింపు దేశ సాంస్కృతిక వారసత్వానికి లభించిన గొప్ప గౌరవమని మోదీ అభిప్రాయపడ్డారు.