Yoga Day

Yoga Day: విశాఖలో యోగాంధ్ర వేడుకలు.. 5 లక్షల మందితో యోగాసానాలు.. ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ

Yoga Day: ప్రపంచవ్యాప్తంగా ఈరోజు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన యోగా ప్రాచీన భారత సంపదగా ప్రపంచం గుర్తిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “యోగాంధ్ర” కార్యక్రమం విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌ను యోగా మహా వేదికగా మార్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరై INS చోళ నుంచి బీచ్‌ రోడ్‌కు చేరుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనకు సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ఘన స్వాగతం పలికారు.

బీచ్ రోడ్‌పై యోగా సందడి

  • RK బీచ్ నుంచి భీమిలి వరకు మొత్తం 30 కిలోమీటర్ల పాటు యోగా ఆసనాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

  • 326 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేశారు. ప్రతి కంపార్ట్‌మెంట్‌లో వెయ్యిమందికి ఆసనాలు వేసే వీలు కల్పించారు.

  • ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో ముగ్గురు యోగా ట్రైనర్లు, 10 మంది వాలంటీర్లు ఉన్నారు.

  • మొత్తం 3 లక్షల మంది ప్రజలు ఇందులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

భద్రత, ఆరోగ్య పరంగా భారీ ఏర్పాట్లు

  • 12,000 మంది పోలీసులతో బీచ్ రోడ్‌ భద్రతను పటిష్టం చేశారు.

  • 2,000 సీసీ కెమెరాలు, 200 అంబులెన్స్‌లు, 4 వేల మొబైల్ టాయిలెట్లు, ప్రతీ కిలోమీటర్‌కు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

గిన్నిస్ రికార్డు దిశగా..

ఈ యోగా ప్రదర్శనను గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మరో 2 లక్షల మంది ఇతర లొకేషన్లలో పాల్గొంటుండగా, మొత్తంగా 50 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు.

“యోగాంధ్ర”… యోగా ద్వారా ఆరోగ్యాంధ్రకు దారి!

ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చూపించిందని చెప్పొచ్చు. ప్రధానమంత్రి మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కలిసి పాల్గొనడంతో ఈ దినోత్సవం మరింత ప్రత్యేకమైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahanadu 2025: కడప గడపలో పసుపు పండగ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *