PM Modi

PM Modi: ప్రధాని మోదీ కీలక ప్రకటన: ‘ప్రతిభా సేతు’ పోర్టల్ ప్రారంభం

PM Modi: యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప శుభవార్త చెప్పారు. ‘మన్ కీ బాత్’ 125వ ఎడిషన్ లో ఆయన ‘ప్రతిభా సేతు’ అనే కొత్త పోర్టల్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ పోర్టల్ ద్వారా సివిల్స్ తుది జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయిన ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు.

‘ప్రతిభా సేతు’ పోర్టల్ అంటే ఏమిటి?
యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ వంటి అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసి, చివరి మెరిట్ జాబితాలో స్వల్ప తేడాతో చోటు కోల్పోయిన అభ్యర్థుల వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేస్తారు. దేశంలోని ప్రైవేట్ కంపెనీలు ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థుల వివరాలను పరిశీలించి, తమ సంస్థలలో వారికి ఉద్యోగాలు ఇవ్వవచ్చు.

ఏళ్లుగా కష్టపడి సివిల్స్ కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులు తుది జాబితాలో పేరు లేకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారని, వారి ప్రతిభను దేశ నిర్మాణానికి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ప్రధాని మోదీ వివరించారు. ఈ పోర్టల్ లక్ష్యం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం మరియు వారి ప్రతిభకు సరైన గుర్తింపు ఇవ్వడం అని తెలిపారు.

Also Read: Revanth Reddy: కేరళలో సీఎం రేవంత్ పర్యటన.. పేదల హక్కుల కోసం పోరాడుతాం

దేశంలోని పలు రాష్ట్రాలను ప్రకృతి వైపరీత్యాలు అతలాకుతలం చేస్తున్నాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), భద్రతా దళాలు, వైద్యులు, సామాజిక కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా జమ్మూకశ్మీర్ పురోగతి సాధిస్తోందని మోదీ అన్నారు. ఇటీవల శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో జరిగిన ‘ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్’ గురించి ఆయన ప్రస్తావించారు. దేశం నలుమూలల నుంచి 800 మందికి పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారని, మహిళా క్రీడాకారులు కూడా అద్భుతమైన ప్రతిభను చూపించారని కొనియాడారు. అలాగే, పుల్వామాలో మొదటిసారిగా రాత్రిపూట క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం దేశంలో వస్తున్న మార్పులకు నిదర్శనమని అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangnana scheme:తెలంగాణ‌లో ద‌స‌రా కానుక‌.. మ‌రో గ్యారెంటీ ప‌థ‌కం అమ‌లుకు రెడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *