Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ప్రధాని ఏమి తింటారు, ఉదయం నుండి రాత్రి వరకు ఎలా జీవిస్తారు. అనే విషయాలు తెలుసుకోవాలిని ప్రతి సామాన్యుడికి ఆశ ఉంటుంది. ఈరోజు (సెప్టెంబర్ 17) ఆయన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, ప్రధాని మోడీ ఉపయోగించే మొబైల్ ఫోన్ గురించి మరింత సమాచారం బయటికి వచ్చింది. ఆ విషయాల గురించి మనం కూడా తెలుసుకుందాం.
ప్రధాని మోదీ ఫోన్ ఏమిటి?
అందరూ వాడే సాధారణ స్మార్ట్‌ఫోన్‌ను కాకుండా, ప్రధాని మోదీ RAX ఫోన్ అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇది మొబైల్ ని సాధారణ జనాలకి అందుబాటులో ఉండే ఫోన్ కాదు. కేంద్ర ప్రభుత్వ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DoT) ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ అధికారుల సున్నితమైన కమ్యూనికేషన్‌ను పూర్తిగా సురక్షితంగా ఉంచడం.
ఇది కూడా చదవండి: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. బీసీల ఉద్దరణే లక్ష్యమంటున్న ఎమ్మెల్సీ
RAX ఫోన్ ప్రత్యేకతలు
-
అత్యాధునిక భద్రతా లక్షణాలు: మూడు పొరల ఎన్‌క్రిప్షన్ సాంకేతికతతో ఈ మొబైల్ తయారవుతుంది. దింతో ఈ మొబైల్ ని హ్యాకింగ్ లేదా ట్రాకింగ్ చెయ్యడం దాదాపు అసాధ్యం అని చూపొచ్చు.
-
వేలిముద్ర గుర్తింపు: అధికారం ఉన్నవారు మాత్రమే ఈ మొబైల్ ని ఉపయోగించగలిగేలా రూపొందించారు.
-
లైవ్ పిక్చర్ వెరిఫికేషన్: ఇందులో కాల్ వచ్చిన సమయంలో ఎవరు చేస్తున్నారో వారి ఫోటో ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
-
హ్యాండ్‌సెట్-లెవల్ ఎన్‌క్రిప్షన్: ఫోన్ నుంచి బయలుదేరే ప్రతి కమ్యూనికేషన్ కూడా హ్యాండ్‌సెట్ నుంచే ఎన్‌క్రిప్ట్ అవుతుంది.
-
మిలిటరీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్: సాధారణ నెట్‌వర్క్‌లకు కాకుండా ప్రత్యేక ఫ్రీక్వెన్సీలపై పనిచేస్తుంది ఈ ఫోన్.
-
ప్రభుత్వ పర్యవేక్షణ: NTRO, DEITY వంటి భద్రతా సంస్థలు వీటిని పర్యవేక్షిస్తాయి.
ధర వివరాలు
RAX ఫోన్ సాధారణ మార్కెట్‌లో లభించదు. ఈ పరికరం ధర, వివరాలు ప్రభుత్వ అంతర్గతంగానే ఉంచుతారు. అందువల్ల ప్రజలకు ఖచ్చితమైన ధర తెలియదు.
మొత్తం మీద, ప్రధాని మోదీ ఉపయోగించే RAX ఫోన్ దేశంలో అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ పరికరాలలో ఒకటిగా నిలుస్తోంది. దింతో మోడీ మాట్లాడే ప్రతి మాట సేఫ్ గా ఉంటుంది.