PM Modi: మన దేశం రూ.433 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారే రోజు ఎంతో దూరంలో లేదు” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఉపాధిపై బడ్జెట్ అనంతర ఆన్‌లైన్ సెమినార్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు. 2014 నుండి 3 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించినట్లు ఈ సందరంభంగా ప్రధాని వెల్లడించారు. ప్రభుత్వం 1,000 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయాలని, ఐదు ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
మన దేశం 329 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇది 433 లక్షల కోట్ల రూపాయలుగా మారే రోజు ఎంతో దూరంలో లేదు.
జాతీయాభివృద్ధికి నైపుణ్యాభివృద్ధి, ప్రతిభ అభివృద్ధి చాలా ముఖ్యమైనవి. ఈ రంగాలలో మరిన్ని పెట్టుబడులు అవసరం అని ప్రధాని మోదీ వివరించారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు
‘ప్రజలలో పెట్టుబడి పెట్టడం’ అనే ఆలోచన విద్య, ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధి అనే మూడు స్తంభాలపై ఆధారపడి ఉంటుందని మోదీ చెప్పారు.
ఈ రంగాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అందరు దేశ ఆర్థికాభివృద్ధికి సహాయం చేయాలి. పర్యాటక రంగంపై దృష్టి సారించి, దేశవ్యాప్తంగా 50 పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రదేశాలలో హోటళ్లకు మౌలిక సదుపాయాల హోదా ఇవ్వడం వల్ల పర్యాటకం సులభతరం అవుతుంది. స్థానిక ఉపాధి పెరుగుతుంది అంటూ ప్రధాని వెల్లడించారు.