Pm modi: ప్రతి పాత్రలో ధర్మేంద్ర జీవించారు

Pm modi: బాలీవుడ్‌ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి భారత చలనచిత్ర పరిశ్రమకు తీర్చలేని లోటు అని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ—

“ధర్మేంద్ర జీ మరణం భారత సినిమాలో ఒక శకం ముగిసినట్లే. ఆయన ప్రతీ పాత్రను పూర్తి నిబద్ధతతో జీవించారు. విభిన్న పాత్రల ద్వారా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆయన నటన మాత్రమే కాదు, ఆయన నిరాడంబరత, వినయం, ఆప్యాయత కూడా అందరికీ ఆదర్శం” అని అభిప్రాయపడ్డారు

“ఈ విషాద సమయంలో ధర్మేంద్ర జీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి” అని ప్రధాని పేర్కొన్నారు.

ధర్మేంద్ర తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో అనేక చిరస్మరణీయ పాత్రలతో ప్రేక్షకులను అలరించారని, ఆయన అకస్మిక మరణం భారత సినీరంగానికి పెద్ద నష్టం అని మోదీ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *