PM Modi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (75) ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఉదయం 4 గంటలకు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ నివాళి:
నటుడు కోట శ్రీనివాసరావు మరణం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన అద్భుతమైన నటనతో నాలుగు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారని ప్రధాని కొనియాడారు. సినిమాపై ఆయనకున్న అంకితభావం, బహుముఖ ప్రజ్ఞను ప్రధాని గుర్తు చేసుకున్నారు. కేవలం నటనలోనే కాకుండా, కోట శ్రీనివాసరావు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారని, పేదల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని మోదీ ప్రశంసించారు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. కోట కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, “ఓం శాంతి” అంటూ ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాలో నివాళులర్పించారు.
Also Read: MLC Kavitha: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కవిత తీవ్ర అభ్యంతరం: శాసనమండలి ఛైర్మన్, డీజీపీకి ఫిర్యాదు
కోట శ్రీనివాసరావు సినీ ప్రస్థానం:
కోట శ్రీనివాసరావు తన సినీ ప్రస్థానంలో 750కి పైగా సినిమాల్లో నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్యనటుడిగా ఇలా ఎన్నో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తన అద్భుతమైన నటనతో తెలుగు సినిమా రంగంలో చెరగని ముద్ర వేశారు.