PM Modi: చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతం కావడానికి కృషి చేసినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తో ఫోన్ లో సంభాషించినట్లు మోదీ వెల్లడించారు.గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ , హమాస్ అంగీకరించాయని ట్రంప్ చేసిన ప్రకటనను మోదీ స్వాగతించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బలమైన నాయకత్వానికి ఇది అద్దం పడుతోందని పేర్కొన్నారు. బందీలను విడుదల చేయడం గాజా ప్రజలకు మెరుగైన మానవతా సాయం అందేలా చూడటం వల్ల..శాశ్వత శాంతికి బాటలు పడతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ తో భారత్ ., అమెరికా వాణిజ్య చర్చల్లో సాధించిన పురోగతిపైనా సమీక్షించినట్లు ప్రధాని మోదీ ఎక్స్ లో వెల్లడించారు. రానున్న రోజుల్లో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు పరస్పరం అంగీకరించినట్లు పేర్కొన్నారు.
Also Read: Putin: అజర్బైజాన్ విమాన ప్రమాదానికి మేమే కారణం : పుతిన్
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతోనూ ఫోన్ లో మాట్లాడిన మోదీ.. శాంతి ఒప్పందం పట్ల అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదని ఎక్స్ లో మోదీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి అధికారిక హ్యాండిల్ సంభాషణను ధృవీకరిస్తూ.. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఇప్పుడే మాట్లాడారు. బందీలందరి విడుదలకు ఒప్పందం కుదిరినందుకు ప్రధాని నెతన్యాహుకు మోదీ తన అభినందనలు తెలిపారు అని పేర్కొంది. కాగా గాజాలో పోరాటాన్ని నిలిపివేయడానికి మరియు బందీలను మరియు ఖైదీలను విడుదల చేయడానికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిన శాంతి ప్రణాళిక యొక్క మొదటి దశకు ఇజ్రాయెల్ మరియు హమాస్ అంగీకరించడానికి కొన్ని గంటల ముందు, ట్రంప్ గురువారం పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లో యుద్ధాన్ని ముగించినట్లు ప్రకటించారు.